పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : కంసుఁడు ముష్టికచాణూరులు మడియుటఁ జూచి తన సేనాపతులతోఁ బలుకుట

భోభూపతి వారు పొలియుటఁ జూచి
రాసంబెడలి బోన నశ్రులొలుక
డివాద్యముల మ్రోఁత వారించి తనదు
డివాళ్ళఁ బిలిచి నిర్భయవృత్తిఁ బలికె.
పాపకర్ముల నిరువుర నీళ్ళ
ద్రాపించి, వసుదేవుఁ దునుమాడి, నంద
గోపునియిలు ముట్టుకొని చెఱఁబెట్టి
గోపాలకులఁ బట్టికొని, యుగ్రనేను
దండించు డని భోజరణీశుఁ డాడు
దండిమాటలకల్గి దానవాంతకుఁడు.   - 230